తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోగా నటించి ,  అలాగే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ,  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఉంటే అడవి శేషు తాజాగా మేజర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ లోని అడవి శేషు నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇది ఇలా ఉంటే అడవి శేషు ప్రస్తుతం హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ కి సీక్వెల్ గా తేరగెక్కుతోంది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ టీజర్ ను నవంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: