లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన కమల్ హాసన్ తమిళ సినిమా ఇండస్ట్రీcలో ఇప్పటికి కూడా మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. విక్రమ్ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి దర్శకులలో ఒకరు అయిన లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా , సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కు సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా ,  ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సూర్యమూవీ లో రోలెక్స్ అనే పాత్రలో నటించాడు. సూర్యమూవీ లో చాలా తక్కువ సమయమే కనిపించినప్పటికీ ఈ మూవీ విజయం లో చాలా కీలక పాత్రను పోషించాడు.

విక్రమ్ మూవీ తో కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను కొల్ల గొట్టింది. విక్రమ్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  హిందీ ,  మలయాళ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల అయింది. తమిళ్ తో పాటు ఈ మూవీకి అన్ని భాషలలో కూడా మంచి కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ తో కమల్ హాసన్ తిరిగి అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను కలిగి ఉన్న కమల్ హాసన్ ఒక్కో సినిమాకు 70 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: