టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు పెళ్లి చూపులు మూవీ తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీ ని కి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఈ మూవీ తో కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. 

ఇలా వరుసగా రెండు మూవీ లతో రెండు విజాయలను అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తరువాత సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాలలో నటించడానికి చాలా ఎక్కువ ఆసక్తిని చూపించాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో కూడా నటించాడు. తాజాగా తరుణ్ భాస్కర్ ... హను రాఘవపూడి దర్శకత్వంలో దుర్కర్ సల్మాన్ ... మృణాల్ ఠాగూర్ హీరో ... హీరోయిన్ లుగా తెరకెక్కిన సీతా రామం మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా తరుణ్ భాస్కర్ కు కూడా మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తరుణ్ భాస్కర్ కీడా కోలా అనే క్రైమ్ కామెడీ మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది. ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే మరికొన్ని రోజుల్లో ఈ మూవీ చివరి షెడ్యూల్ ని కూడా ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ‘కీడా కోలా’ మూవీ ని 2023 లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: