దక్షిణాది సినిమా రంగంలో దర్శకుడు శంకర్ ఒక వెలుగు వెలిగి భారీ బడ్జెట్ సినిమాలకు చిరునామాగా కొనసాగాడు. అయితే ‘బాహుబలి’ తరువాత రాజమౌళి మ్యానియా పెరిగి అతడు పాన్ ఇండియా డైరెక్టర్స్ లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగి పోవడంతో శంకర్ స్పీడ్ కొంతవరకు తగ్గింది. దీనికితోడు గత కొన్ని సంవత్సరాలుగా అతడు తీస్తున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండటంతో శంకర్ ఇమేజ్ మసకబారింది.


ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ తో అతడు తీస్తున్న మూవీ ఆశక్తి దాయకంగా మారడమే కాకుండా ఆమూవీ పై అతడు ఖర్చు పెడుతున్న బడ్జెట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వాస్తవానికి ఈమూవీ చిత్రీకరణ ఈపాటికి పూర్తి కావలసి ఉంది. అయితే మధ్యలో ఈమూవీకి బ్రేక్ ఇచ్చి శంకర్ కమలహాసన్ తో తీస్తున్న ‘భారతీయుడు 2’ వైపు వెళ్ళిపోవడంతో దిల్ రాజ్ సినిమా ఆగిపోవడంతో ప్రస్తుతం దిల్ రాజ్ టెన్షన్ లో ఉన్నాడని టాక్.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ చిత్రీకరణ మళ్ళీ మార్చి నుండి మొదలుపెట్టి 6నెలలలో ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఈమూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తాను అని శంకర్ ఇచ్చిన మాట పై దిల్ రాజ్ ధైర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు శంకర్ కు అనుకోకుండా మరొక సమస్య వచ్చి పడింది అంటున్నారు. కమలహాసన్ ‘భారతీయుడు 2’ మూవీని ఈసంవత్సరం దీపావళికి విడుదల చేద్దామని శంకర్ భావించాడట.


అయితే అదే దీపావళికి తమిళ టాప్ హీరో విజయ్ మూవీ విడుదల అవుతున్న పరిస్థితులలో అనవసరపు పోటీ ఎందుకు అనీ ‘భారతీయుడు 2’ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని కమలహాసన్ అదేవిధంగా ఈమూవీని నిర్మిస్తున్న లైకా సంస్థ నిర్మాతలు శంకర్ ను కోరుతున్నట్లు టాక్. అయితే ఇప్పటికే శంకర్ రామ్ చరణ్ తో తీస్తున్న మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు రెడీ చేస్తున్న పరిస్థితులలో తన సినిమా పై తన సినిమానే పోటీగా విడుదలచేయడం ఇష్టంలేక ఈఇద్దరు ప్రముఖ నిర్మాతలకు ఎలా సద్దిచెప్పాలో తెలియక శంకర్ అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..
మరింత సమాచారం తెలుసుకోండి: