ఇండస్ట్రీలో ప్రేమ దోమ అనేది సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ల మధ్య పుట్టిన ప్రేమ కొన్నాళ్ల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ జంట ఇక చట్టా పట్టాలు వేసుకొని తిరగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా ప్రేమలో పడిన జంటలు కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుని తమ ప్రేమకు ప్రమోషన్ ఇస్తే.. మరికొన్ని జంటలు మాత్రం బ్రేకప్ చెప్పేసుకొని కొత్త జోడిని వెతుక్కునే పనిలో బిజీబిజీగా ఉంటున్నారు అని చెప్పాలి.


 కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల వారసురాలుగా వచ్చినవారు ఇండస్ట్రీలో ఎవరితో అయినా ప్రేమలో పడ్డారు అంటే చాలు ఏకంగా వాళ్ల తండ్రులు అయినా స్టార్ హీరోలు  రంగంలోకి దిగి తన కూతురు ప్రేమించిన హీరో కెరియర్ నేను నాశనం చేయడం లాంటివి కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. తెలుగు తమిళం కన్నడం మలయాళం అని తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు కమలహాసన్. అయితే కమలహాసన్ కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇక కమలహాసన్ తన ప్రేమాయణాలతో కూడా ఎప్పుడూ వార్తలు నిలిచేవాడు.



 ఇకపోతే ఇక ఇప్పుడు కమలహాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంటుంది. అయితే నటన విషయంలో కాదు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చడం విషయంలో. అప్పట్లో కమలహాసన్ హీరోయిన్స్ ని మార్చినట్లుగానే.. ఇక ఇప్పుడు శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తుంది అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా శృతిహాసన్ టాలీవుడ్ లో ఒక హీరోని ప్రేమించిందట. షూటింగ్ సమయంలో వీరి మధ్య పరిచయం మొదలై ప్రేమగా మారిందట. అయితే ఆ హీరోకి బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో కమలహాసన్ రంగంలోకి దిగి ఆ హీరో కెరియర్ ని నాశనం చేశాడట. ప్రజెంట్ ఆ హీరో ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడట. ఈ వార్త కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: