కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సినిమాలను మాత్రమే రెండు మూడు భాషలలో విడుదల చేసేవారు. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుండి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. సినిమాలో కొంచెం కంటెంట్ ఉన్నట్లు అయితే దానిని పాన్ ఇండియా రేంజ్ లో మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాగా అందులో కొన్ని సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసులు చేశాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కబ్జా. ఈ మూవీ లో మలయాళ స్టార్ హీరో లు అయినటు వంటి ఉపేంద్ర ... కిచ్చ సుదీప్ లు హీరోలుగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మార్చి 17 వ తేదీన మలయాళం , తెలుగు , కన్నడ , హిందీ , తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

కానీ ఆ తర్వాత ఈ సినిమా ప్రమోషన్ ల విషయంలో మూవీ యూనిట్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ మూవీ ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉన్నప్పటికీ విడుదల సరైన ప్లాన్ చేసుకోలేదు. దానితో సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ ఈ సినిమాపై సరైన బజ్ ఏర్పడడం లేదు. మరి ఈ మూవీ కి టాక్ సూపర్ గా వచ్చినట్లు అయితే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కబ్జా మూవీ తో ఉపేంద్ర ... సుదీప్ లు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: