పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుబోయే వినోదయ సీతం తెలుగు రీమిక్ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో పవన్ తో పాటు యంగ్ హీరో సాయి దరమ్ తేజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఈ ఇద్దరు మెగా హీరోలు ఒకే మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ మొదలు కాకముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండడం కోసం అనేక మార్పులు ... చేర్పులు ఈ సినిమా కథలో చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో రెండు పాటలను కూడా జోడించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన శ్రీ లీల గాని కేతిక శర్మ గాని హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులను కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ షూటింగ్ ను కూడా చాలా స్పీడ్ గా రూపొందించి ఈ మూవీ ని అతి తక్కువ రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకోరావడానికి ఈ మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి వివేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను ప్రకటించడానికి ఇంకా టైమ్ ఉంది ... ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను తర్వాత చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: