సమంత కెరియర్ లో చాల సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఆరోజులలో సమంత ఆత్మగా చిన్మయి ని గుర్తించేవారు. అయితే ఆతరువాత కాలంలో సమంత తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టి ఆవిషయంలో సక్సస్ సాధించింది. తెలుగు భాష ఆమె చాల అనర్గళంగా మాట్లాడగలదు.


అయితే ఆమె ఇప్పటివరకు ఎటువంటి పౌరాణిక సినిమాలలో నటించలేదు. దీనికితోడు పౌరాణిక పాత్రల సంభాషణలు చాల గంభీరంగా ఉంటాయి. అలాంటి పాత్రలు నటించే నటీనటులకు తెలుగు భాష పై మంచి పట్టు ఉండాలి. దీనికితోడు గొంతులో గంభీరత కనిపించాలి. గతంలో శారద వాణిశ్రీ జమున లాంటి హీరోయిన్స్ పౌరాణిక పాత్రలలో నటించి ఆపాత్రలకు జీవం పోశారు.


అలాంటి స్థాయిలో సమంత డైలాగ్స్ చెప్పగలదా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు సమంత గొంతు మైనస్ అవుతుందా అన్న చర్చలు కూడ జరుగుతున్నాయి. మరొక విషయం ఏమిటంటే ఈసినిమాకు సంబంధించి సమంత తెలుగు తమిళ మళయాళ హిందీ భాషలలో తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఒక విధంగా ఇది చాల సాహసం అని అంటున్నారు. పౌరాణిక సినిమాలకు ఆయువుపట్టు అయిన డైలాగ్స్ చెప్పడంలో తేలిపోతే దాని ప్రభావం సినిమా సక్సస్ పై ఉంటుంది.

అయితే సమంత ఈవిషయంలో మరొక విధంగా స్పందిస్తోంది. వేర్వేరు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం చాలా క‌ష్ట పడ్డానని దీనికోసం తాను చాల రిహార్సిల్స్ చేసానని అంటోంది. అయితే ఆమె కష్టం ఎంతవరకు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా 5 భాషలలో విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ ఫలితంలో తేడా వస్తే ఈమూవీ బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అది సమంత భవిష్యత్ సినిమాల మార్కెటింగ్ పై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. అయితే ప్రస్తుతం దిల్ రాజ్ అదృష్టం పరుగులు తీస్తున్న పరిస్థితులలో ఆయన చేయి పడిన ‘శాకుంతలం’ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: