యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ తాజాగా మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ని మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది.

అలాగే ఈ మూవీ నుండి ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి గ్రామీణ నేపథ్యంలో కామెడీని పండించే విధంగా ఉండడంతో ఈ మూవీ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటు వంటి అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నాడు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రిలీజ్ దొరికే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. 

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం పూర్తి చేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి "యు/ఎ" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన మేము ఫేమస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా ఈ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: