తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నటుడు ఆఖరుగా ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు జాతి రత్నాలు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి అనుదీప్ కే వి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగు , తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేశారు. 

మూవీ రెండు భాషల్లో కూడా పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కార్తికేయన్ "మావిరన్" పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లు మడోనా అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అతిథి శంకర్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను మొదట ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన కాకుండా జులై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ సినిమాను మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క తమిళనాడు థియేటర్ హక్కులను రెడ్ జైంట్ మూవీస్ సంస్థ దక్కించుకున్నట్లు తాజాగా ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk