కొణిదెల నిహారిక... ఈ అమ్మడు కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఈ మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తుంది. కాకపోతే తన అదృష్టం కలిసి రాక కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ పెద్ద సక్సెస్ దొరకలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిహారిక వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే కాస్తో కూస్తో కొంత గ్లామర్ చూపించాల్సి వస్తుంది.
View this post on InstagramAll my firsts are going up on my IGTV. So here it is - my first ever dance video! @yashwanthmaster @raj.dop @binesh_babu_violinist
![]()
అయితే హద్దులు దాటకుండా తనలోని టాలెంట్ ను బయట పెట్టేందుకు కొణిదెల నిహారిక ప్రయత్నం చేస్తోంది.అయితే ఇప్పటికే తాను ట్రెండీ దుస్తుల్లో ఉన్న ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. అయితే నిన్నటి రోజున ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా నిహారిక తన ఫస్ట్ డాన్స్ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది.
నిజానికి అది మామూలు సప్రైజ్ కాదు... ఎందుకంటే, ఆ వీడియోలో రొమాంటిక్ డాన్స్ చేసింది కాబట్టి. అయితే ఆ డాన్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ తో కలిసి నిహారిక స్టెప్పులు వేసింది. చెలి చిత్రంలోని మనోహర సాంగ్ కు మతిపోగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కొణిదెల నిహారిక. ఈ వీడియోలో ఇద్దరూ ఫర్ఫెక్ట్ సింకులో డాన్స్ చేశారు. నిహారిక బ్లాక్ డ్రెస్సులో కనిపించారు. అయితే ఈ వీడియోకి తన అభిమానుల నుంచి చాలా ప్రశంసలు దక్కుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి