చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్, శ్రీహరి గురించి తెలియని వారంటూ ఉండరు. ఇద్దరు నటులు ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించగలరు. ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా హీరోగా నటించి మెప్పించారు శ్రీహరి అయితే రియల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. శ్రీహరి 1986లో దర్శకదిగ్గజం దాసరి నారాయణ రావు తెరకెక్కించిన బ్రహ్మనాయుడు సినిమా ద్వారా తెరకు పరిచయమయ్యారు.

శ్రీహరి తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి కామెడీ విలన్‌గా నవ్వులు కురిపించారు. ఆపై హీరోగా టర్న్ తీసుకొని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనదైన నటన కనబరిచారు. ఇక శ్రీహరి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పేరు వింటే చాలు ఎన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. పోలీస్ గా మొదలైన ఆయన హీరోయిజం భద్రాచలం, గణపతి, అయోధ్యరామయ్య, విజయరామరాజు వంటి అనేక పాత్రల్లో రాణించింది. నువ్వుస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఈ చిత్రంలో ఆయన నటనకుగానూ నంది అవార్డు సైతం వరించింది.

తెలుగులో యస్వీరంగారావు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట శ్రీనివాస్ రావుల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఆయన అన్ని భాషలోని నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రకాష్ రాజ్ ఒక తండ్రిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో పాత్రలను పోషించి ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు అయితే శ్రీహరి ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న రిలేషన్  ఏమిటో తెలుసుకుందామా.

అయితే శ్రీహరి భార్య డిస్కోశాంతి ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ళు తండ్రి ఆనంద్ కన్నడ తమిళ మలయాళ పరిశ్రమలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  విలన్ గా నటించి మెప్పించారు ఈయన కూతుర్ల లో పెద్దమ్మాయి లలితకుమారి ని ప్రకాష్ రాజు కిచ్చి వివాహం చేశారు రెండో అమ్మాయి డిస్కో శాంతి శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీహరి ప్రకాష్ రాజ్ ఇద్దరు తోడల్లుడు అయ్యారు వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: