టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా వాటిలో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. మరెన్నో సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఇంకా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు గా నిలిచిపోయాయి. ఆవిధంగా 2021 వ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఏ విధంగా ఉపయోగపడినా కూడా ఆ సినిమాలు విడుదల అయ్యి తెలుగు సినిమా పరిశ్రమ ముందుకు పోవడానికి కారణం అయ్యింది. 2021 వ సంవత్సరం ముగింపు దశకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి మరో రెండు నెలల కాలంలో విడుదలయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో పెద్ద హీరోల సినిమాలు క్రేజీ చిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రజనీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న చిత్రం రానుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుంది చూడాలి. ఇక ఆ తర్వాత నవంబర్ లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పక విమానం సినిమా ఉంది. ఆ పై రౌడీ బాయ్స్ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ చివర్లో పెద్ద సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. వాటిలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని చిత్రం కూడా ఉంది.

ఇక నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయి చిత్రం కూడా డిసెంబర్ లో ప్రేక్షకులను అలరించబోతోంది. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది.  యావత్ దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఆ తర్వాత డిసెంబర్ చివర్లో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం రాబోతుంది అని చెబుతున్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: