కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త డైరెక్టర్ గా వశిష్ట తెరకెక్కించిన తాజా చిత్రం బింబి సార. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా విడుదలైన వారం రోజులు అవుతున్న ఇంకా థియేటర్లలో ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. ఈ సినిమా పైన ప్రేక్షకులే కాకుండా ప్రముఖ నటీనటులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు తాజాగా నందమూరి కుటుంబం కొసం ఈ సినిమా ఒక స్పెషల్ వేశారు దీనికి నందమూరి కుటుంబ సభ్యులు అంతా విచ్చేయడం జరిగింది బాలకృష్ణ మోక్షజ్ఞతో పాటు తమ కుటుంబంతో కూడా ఈ సినిమాని కలిసి చూడడం జరిగింది. అయితే అలా చూసిన బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి చూద్దాం.సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ని అభినందించడం జరిగింది మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి అని.. అలాగే అన్నయ్య హరికృష్ణ దీవెనలు, బాబాయి గా నా దీవెనలు తనకు ఉంటాయని కళ్యాణ్ రామ్ ని ఉద్దేశిస్తూ తెలియజేశారు. డైరెక్టర్ వశిష్టును ఉద్దేశిస్తూ ఈ సినిమా బాగా చేశావు త్వరలోనే మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం నీలాంటి డైరెక్టర్ సపోర్టు వస్తూ ఉండాలని మెల్లమెల్లగా కాకుండా మొదటిసారి ఇంత పెద్ద సినిమాని బాగా చేశావని పొగిడాడు. ఇలాంటి అవకాశలు ఇవ్వడం మా నందమూరి వంశానికే చెందిందని తెలిపారు.

మేము కొత్త వాళ్ళని టాలెంటెడ్ వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటామని ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు ఆదరించి మరొకసారి తెలుగు వారి ప్రఖ్యాతను చాటి చెప్పారని తెలిపారు ఇక నాన్నగారు కూడా అప్పట్లో ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలు తెరకెక్కించాలని ఇందులో మంచి మంచి సందేశాలు కూడా ఉన్నాయని అభినందించారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: