1985 నుండి సుమారు రెండు దశాబ్ధాల పాటు టాప్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన బాబు మోహన్ ఆతరువాత రాజకీయాల బాట పట్టడంతో నెమ్మదిగా సినిమాల నుండి కనుమారుగైపోయాడు. ఆయన సినిమాలలో నటించడం పూర్తిగా తగ్గించినప్పటికీ కోట శ్రీనివాస్ రావు బాబు మోహన్ ల కాంబినేషన్ కామెడీ సీన్స్ ను ఇప్పటికీ బుల్లితెర పై ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.


అలాంటి బాబు మోహన్ మళ్ళీ నటుడుగా బిజీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఒక వెబ్ సిరీస్ లో బాబు మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గోంటేష్ ఉపాధ్యే అనే దర్శకుడు  రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ నెల 28 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ కు ఇప్పటికే మంచి స్పందన రావడంతో బాబు మోహన్ అభిమానులు ఈ వెబ్ సిరీస్ తో మళ్ళీ అతడి హవా ప్రారంభం  అవుతుందని ఆశిస్తున్నారు.


ఈ వెబ్ సిరీస్ లో తమ కుటుంబం కోల్పోయిన ఇంటిని వెనక్కి తెచ్చుకునేందుకు బార్ పెట్టాలనుకునే ఒక అమ్మాయి కథ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా మందికి నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న బాబు మోహన్ మళ్లీ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నట్లు అనిపిస్తోంది.


ఈ ట్రైలర్ ను నిశితంగా పరిశీలించిన వారికి బాబు మోహన్ సరైన పాత్ర లభిస్తే నటుడుగా ఎలా చెలరేగిపోతాడో మళ్ళీ అర్థం అవుతుంది. ప్రస్తుతం కామెడీ ఆర్టిస్టులు అంటే కేవలం జబర్దస్త్ ఆర్టిస్టులు మినహా మరెవ్వరూ గుర్తుకురాని పరిస్థితుల మధ్య సీనియర్ కామెడియన్స్ పేర్లు చాలామంది మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితులలో ఈ వెబ్ సిరీస్ తో బాబు మోహన్ హవా మళ్ళీ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: