తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఆ తర్వాత నుండి వరుస పెట్టి నటిస్తూ వస్తున్నాడు. కానీ ఈయనకు భారీ బ్లాక్ బస్టర్ విజయం చాలా కాలం పాటు దక్కలేదు. కొంత కాలం క్రితం ఈ నటుడు క అనే మూవీ లో హీరో గా నటించాడు. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో కిరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. "క" లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత ఈయన దిల్రుబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక "క" లాంటి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ నటించిన మూవీ కావడంతో దిల్రూబా మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ కి మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. కానీ మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయిలో అపజయాన్ని అందుకుంది. మరి ఈ మూవీ కి ఎన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ..? ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను అందుకుంది ..? ఎన్ని కోట్ల నష్టాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 11 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి మొదటి వారంలో 2.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కగా , మిగిలిన మొత్తం రోజులలో 45 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ బాక్సా ఫీస్ రన్ అండ్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి 2.5 కోట్ల రేంజ్ లో క్రాస్ కలెక్షన్లు దక్కగా ... 1.25 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ... 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కి 9.50 కోట్ల రేంజ్ లో లాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: