కోలీవుడ్ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. తాజాగా సూర్య "రెట్రో" అనే సినిమాలో హీరో గా నటించాడు. పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించగా ... కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి వచ్చిన సర్టిఫికెట్ వివరాలను కూడా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టల్ వైరల్ అవుతుంది.

ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. దానితో ఈ మూవీ లో మామూలు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అని , భారీ రక్త పాతంతో కూడిన సన్నివేశాలు ఉండవు అని అర్థం అవుతుంది. కంగువా మూవీ తో భారీ ఫ్లాప్ ను అందుకున్న సూర్య "రెట్రో" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: