
మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే సమంత నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకుని కలిసి నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడిపోయారు. వీరిద్దరు విడిపోయినా ఏదో ఒక సందర్భంలో వీరి గురించి కంబైన్డ్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. సమంత కొంత కాలంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటించిన సినిమా కాకుండా తన నిర్మాణంలో తెరకెక్కించిన సినిమా ఒకటి త్వరలోనే ప్రేక్షకులను పలకరించేందుకు ముందుకు వస్తోంది. ఈ సినిమా శుభం.
యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. వైజాగ్‌కు తనకు ఉన్న అవినాభావ సంబంధం గురించి సమంత చెప్పారు. తాను చేసిన సినిమాల్లో మజిలీ గురించి ముందుగా ప్రస్తావించి .. ఆ తర్వాత ఓ బేబీ అలాగే రంగస్థలం సినిమాల ఈవెంట్స్ ఇక్కడ నుంచే అయ్యాయి ... అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఈసారి కూడా నాకు బ్లాక్ బస్టర్ ఇస్తారా అంటూ సమంత విశాఖ ప్రజలని అడిగింది. ఇక మరోసారి మజిలీ సినిమా తన మాజీ భర్త చైతుతో చేసిన సినిమా గురించి ఆమె ముందుగా ప్రస్తావించడంతో ఆమె చైతు జ్ఞాపకాలను ఏదోలా గుర్తు పెట్టుకుంటూనే ఉందన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు