
ఈ విషయం విన్న అభిమానులు చాలా సంబరపడిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కియారా సంబంధించి ఎలాంటి ఫోటోలు కూడా ఎక్కడ రివిల్ కాలేదు. కానీ తాజాగా కియారా అద్వానీ సొంతంగా తన ఇక్స్ట్రాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తూ బేబీ బంప్ ఫోటోలతో మరింత అందంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ గా పేరుపొందిన గాలా 2025 సంబంధించి న్యూయార్కులో చాలా గ్రాండ్గా జరుగుతోంది.
అక్కడికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు ఈ మేరకు బాలీవుడ్ నుంచి ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. మొదటిసారి పాల్గొన్న వారిలో కియారా కూడా ఒకరు. గర్భవతి అయినా కూడా మొదటిసారి మెట్ గాలా కార్పొరేట్ పైన బేబీ బంపుతో ఒక్కసారిగా దర్శనం ఇచ్చిన ఫోటోలు షేర్ చేసింది.ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. కియారా ధరించిన గౌను మరింత అందంగా ఆమె అందాన్ని కనిపించేలా చేస్తున్నది. మొత్తానికి బేబీ బంప్ ఫోటోలతో మరొకసారి వార్తలలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాగే ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి కనిపించింది.