2002లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రం `ఖ‌డ్గం`. శ్రీ‌కాంత్, ర‌వితేజ‌, ప్ర‌కాశ్ రాజ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించ‌గా..సోనాలి బెంద్రే, సంగీత‌, కిమ్ శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించారు. కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ మీద సుంకర మధు మురళి నిర్మించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. దేశ‌భ‌క్తి క‌థాంశంతో వ‌చ్చిన ఖ‌డ్గం ఎన్నో వివాదాల న‌డుమ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఐదు నంది అవార్డుల‌ను సొంతం చేసుకుంది.


దేశ భక్తికి లవ్ ట్రాక్‌, బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, ప్యాషన్ వంటి అంశాల‌ను జోడించి అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే విధంగా కృష్ణ‌వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. అత్యుత్త‌మ దేశ భ‌క్తి చిత్రాల్లో ఖ‌డ్గం సినిమాను ఒక‌టిగా నిల‌బెట్టారు. అలాగే క‌థ‌లోని ప్ర‌తి పాత్ర‌ను గుర్తిండిపోయేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా  `ఒక్క ఛాన్స్` అంటూ ఎంతో అమాయకంగా అడిగే సీతా మహాలక్ష్మిని మ‌ర్చిపోలేం. ఆ పాత్ర‌ను ప్ర‌ముఖ న‌టి సంగీత పోషించింది. హీరోయిన్ అవ్వాల‌నే క‌ల‌తో ప‌ల్లెటూరు నుంచి త‌ల్లితో క‌లిసి ప‌ట్నం వ‌చ్చే అమాయకమైన అమ్మాయి పాత్రలో సంగీత జీవించేసింది.


నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఆమె పాత్ర‌ను డిజైన్ చేశారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. సీతా మహాలక్ష్మి పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సంగీత కాద‌ట‌. మొద‌ట మ‌రొక హీరోయిన్ ను ఆ పాత్ర కోసం సంప్ర‌దించ‌గా.. ఆమె నో చెప్పింద‌ట‌. ఇంత‌కీ ఆ అన్ లక్కీ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు సాక్షి శివానంద్. క‌థ విన్న సాక్షి.. సీతా మహాలక్ష్మి క్యారెక్ట‌ర్‌ను రిజెక్ట్ చేయ‌డంతో కృష్ణ‌వంశీ మ‌రో ఆప్ష‌న్ లేకుండా సంగీత‌ను తీసుకున్నాట‌. ఇక‌ ఖ‌డ్గం మూవీతో సంగీత‌ తెలుగులో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌కు ప‌రిమితం అయిన సంగీత‌.. ఆ త‌ర్వాత‌ టాలీవుడ్ లో ఫుల్ బిజీ యాక్ట్ర‌స్‌గా స‌త్తా చాటారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: