పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలను మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూడు మూవీలను మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో అత్యంత బిజీ అయిపోయాడు. దానితో ఈ మూడు మూవీల షూటింగ్లను పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇందులో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలను వ్యవహరిస్తున్నాడు. ఉపముఖ్యమంత్రిగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కు అసలు తీరిక దొరకడం లేదు.

దానితో ఎలక్షన్లు పూర్తి అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న సినిమా షూటింగ్లకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో పవన్ వీలు దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లకు సమయాన్ని కేటాయిస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కొన్ని రోజులను హరిహర వీరమల్లు సినిమా షూటింగ్కి కేటాయించాడు. దానితో ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ సంవత్సరం జూన్ 12 వ తేదీన ఆ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం పవన్ "ఓజి" మూవీ కి తేదీలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన కేవలం ముంబై షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ఈ మూడు మూవీ ల షూటింగ్లను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అని పిక్స్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: