పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు రోజులు క్రితం హాస్పిటల్ లో హీరోయిన్ తో ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్హీరోయిన్ ని తీసుకొని హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు.ఆ హీరోయిన్ తో పవన్ కళ్యాణ్ కి ఉన్న సంబంధం ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగిస్తున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏ హీరోని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ఇంతకీ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న సీన్ పూర్తి చేశారట చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఒక హాస్పిటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ లపై ఒక సీన్ చిత్రీకరించాల్సి ఉందట. 

అయితే ఈ సన్నివేశాన్ని పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ లపై హాస్పిటల్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక హాస్పిటల్ లో ఉన్న వీరిద్దరి వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఇదేంటి పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లారు. అసలు ప్రియాంక మోహన్ కి ఏం జరిగింది అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే హరిహర వీరమల్లు సినిమాలోని ఓ చిన్న షాట్ కోసం పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లారని తెలుస్తోంది.. ఇక ఈ హాస్పిటల్ సన్నివేశం పూర్తి చేసుకున్నాక ఓ పది రోజులు ముంబైలో షూట్ చేసి హరహర వీరమల్లు మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తారట పవన్ కళ్యాణ్.

ఇక హరిహర వీరమల్లు మూవీలో ప్రియాంక మొహన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురించి టాలీవుడ్ లో తాజాగా రిలీజ్ డేట్ పై ఒక రూమర్ వినిపిస్తోంది.అన్ని పూర్తయితే సెప్టెంబర్ 25కి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ చేసే యోచనలో పడ్డారట మేకర్స్. మరి ఈ రిలీజ్ డేట్ అయిన కరెక్ట్ గా ఉంటుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.ఇక హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: