టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒకరు. ఇది ఇలా ఉంటే చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబోలో మొత్తం 14 సినిమాలు వచ్చాయి. అందులో రెండు సినిమాలలో చిరంజీవి ముఖ్య పాత్రలలో నటించగా ... 12 సినిమాలలో హీరోగా నటించాడు. మొత్తం చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన 14 సినిమాల్లో చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే వీరి కాంబోలో కొన్ని సినిమాలు మిస్ కూడా అయ్యాయి. అలా వీరి కాంబోలో కొన్ని సినిమాలు మిస్ కూడా అద్భుతమైన అయ్యాయి. మరి చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబోలో మిస్ అయిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరోగా అల్లుడు గారు అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మొదట మోహన్ బాబుతో కాకుండా చిరంజీవితో చేయాలి అని రాఘవేందర్రావు అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవితో కాకుండా మోహన్ బాబుతో ఈ మూవీ ని రూపొందించాడట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకోండి. నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆఖరి పోరాటం అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో మొదట రాఘవేంద్రరావు , చిరంజీవిని హీరో గా అనుకున్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఈ మూవీ లో చిరంజీవిని కాకుండా నాగార్జునను హీరోగా ఎంచుకున్నాడట. అలా చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: