హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్2 సినిమా తెలుగు వెర్షన్ టీజర్ కు ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఒకింత అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి తెలుగులో మంచి గుర్తింపు ఉన్న యూట్యూబ్ ఛానెళ్లలో వార్2 టీజర్ విడుదలై ఉంటే ఈ టీజర్ కు వచ్చే రెస్పాన్స్ మరో విధంగా ఉండేది.
 
వార్2 టీజర్ కు సంబంధించి తారక్ టీమ్ కు సైతం సరైన సమాచారం అందలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. వార్2 టీజర్ విషయంలో తప్పు జరిగిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తారక్ ను నెగిటివ్ రోల్ లో చూడబోతున్నామని భావించిన అభిమానులు హీరో పాత్ర భిన్నంగా ఉండటంతో షాకయ్యారు. హృతిక్, తారక్ మధ్య ఫేసాఫ్ సీన్లు ఆకట్టుకోవడం సులువు కాదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వా2 సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని సినీ అభిమానులు భావిస్తున్న తరుణంలో హిందీ వెర్షన్ కు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తెలుగు వెర్షన్ కు మాత్రం కలెక్షన్ల విషయంలో కొంతమేర షాక్ తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ తారక్ ను పూర్తి స్థాయిలో డామినేట్ చేశారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
 
వార్2 సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమాలో కథ, కథనం పరంగా ట్విస్టులు ఒకింత ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది. వార్2 సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. వార్2 మూవీ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.  వార్2 ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: