
మరోవైపు సమంత మాత్రం ఆ పెయిన్ నుంచి బయటపడటానికి చాలా సమయమే తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఆమె హుషారుగా కనిపిస్తోంది. ఇటీవల `శుభం` మూవీతో నిర్మాతగా మారి తొలి సక్సెస్ ని అందుకుంది. అయితే చైతుతో విడిపోయాక అక్కనేని ఫ్యామిలీని సమంత కలిసింది లేదు. కనీసం వారి పేర్లు కూడా ఎత్తిన సందర్భాలు లేవు. ఏదైనా ఇంటర్వ్యూలో చైతు టాపిక్ వచ్చినా.. సమంత అతని పేరు ప్రస్తావించకుండానే మాట్లాడుతుంటుంది.
అలాంటి సమంత విడకుల తర్వాత ఫస్ట్ టైమ్ అక్కినేని ఫ్యామిలీతో కలిసి కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా ప్రముఖ ఛానల్ `జీ` లో అప్సర అవార్డ్స్ 2025 వేడుక జరిగింది. ఈ ఈవెంట్ కు సమంతతో పాటు అక్కినేని అమల కూడా హాజరు కావడం విశేషం. ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సమంతకు జీతెలుగు వారు స్పెషల్ అవార్డును బహుకరించడమే కాకుండా ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం సమంత ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం.. అందుకు స్టేజ్ కింద ఉన్న అమల చప్పట్లు కొట్టడం హైలెట్ గా మారింది.
అలాగే గత మూడు దశాబ్దాల నుంచి జంతు సంరక్ష చేపట్టే కార్యక్రమాలు చేసినందుకు గానూ అమల కూడా అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అప్సర అవార్డ్స్ వేడుకలో అమల, సమంత మాట్లాడుకున్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.