కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాల ద్వారా యశ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యశ్ తన టాలెంట్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యశ్ కు పాపులారిటీ ఉంది. ప్రస్తుతం యశ్ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ కోతలవాడి అనే సినిమాను నిర్మించారు.
 
శ్రీరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ ఈవెంట్ లో భాగంగా యశ్ తల్లికి మీ కొడుకుతో సినిమా తీయాలని అనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారనే ప్రశ్న ఎదురు కాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యశ్ తో సినిమా చేయాలని భావించడం లేదని పుష్ప పేర్కొన్నారు. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి కానీ అన్నీ ఉన్నవాడికి అన్నం పెడితే విలువ తెలియదని చెప్పుకొచ్చారు.
 
నేను చెప్పేది నిజమా కాదా అంటూ ఆమె ప్రశ్నించడం గమనార్హం. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడని నేను మాత్రం యశ్ తో ఎలాంటి సినిమా తెరకెక్కించబోనని నిర్మించబోనని యశ్ తల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. యశ్ తల్లి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. యశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
 
యశ్ భవిష్యత్తు సినిమాలకు ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది. యశ్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిల్ ఓ ఉందనే సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న యశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. యశ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: