
ముఖ్యంగా సిగరెట్లు, పాన్ మసాలాలు, ఆల్కహాల్ గుట్కా వంటి బ్రాండ్ల ప్రమోషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సెలబ్రిటీలు. వీటి యాడ్లకు సంబంధించి చాలా మంది వెనక్కి కూడా తగ్గారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ బ్రాండ్ కి ఎంపికైనట్లు తెలుస్తోంది. మ్యాజిక్ మూమెంట్ వోడ్కాకు కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటినుంచి మ్యాజిక్ మూమెంట్ కి సంబంధించి అన్ని బ్రాండ్ల ప్రమోషన్స్ ని ప్రమోట్ చేయవలసి ఉన్నది కృతి సనన్.
కృతి సనన్ పైన కూడా మ్యాజిక్ మూమెంట్ బ్రాండ్ ప్రతినిధులు కూడా ఈమె పైన ప్రశంసలు కురిపించారు.. ఇక కృతి సనన్ కూడా మ్యాజిక్ మూమెంట్ అంటే ఒక మంచి అనుభూతిని పొందవచ్చు.. ఈ మ్యాజిక్ కుటుంబంలో చేరడం ఉత్సాహంగా అనిపిస్తోందని.. మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుంది అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. దీంతో అభిమానులు నెటిజన్స్ సైతం కృతి సనన్ పైన ఫైర్ అవుతున్నారు. సీత లాంటి పాత్రలు చేసి ఇప్పుడు ఇలాంటి ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం సరైనదేనా అంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఆరాధించే అభిమానులకు ఇలాంటి సందేశాలు ఇవ్వడం మంచిదేనా అంటూ మరి కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.