ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ పై ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలకు సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తీవ్రంగా ఖండించడంతో పాటు ఘాటుగా స్పందించారు. నారాయణ మూర్తి గారితో తనకు మంచి అనుబంధం ఉందని చెపుతూనే గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినా.. టిక్కెట్ రేట్లు తగ్గించి, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ రోజు థియేటర్లను మూసి వేస్తామని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ రోజు ఆయన ఏం మాట్లాడలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని.. గత సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తే చిరంజీవి, ప్రభాస్, మహేష్ లాంటి పెద్ద హీరోలతో పాటు నారాయణ మూర్తి కూడా వెళ్లారు. ఆ రోజు చిరంజీవిని అవమానపరిచినప్పుడు నారాయణమూర్తి మౌనంగా ఉన్నారని నట్టి అన్నారు.
ఐదో షో కూడా నాడు నారాయణమూర్తి చిన్న సినిమా కోసం ఇప్పించ లేకపోయారని.. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదు.. ఇక మూడు వారాల ముందు నోటీసు ఇవ్వకుండా థియేటర్ల బంద్ చేస్తామని ప్రకటన చేయడాన్ని కూడా నట్టి తప్పు పట్టారు. ఈ నిబంధనలు అన్నీ ఆయనకు తెలిసినా కూడా కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో నారాయణమూర్తి బందీ అయ్యారని, ఏ శక్తులు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించాయో కూడా తనకు తెలుసన్నారు. నారాయణ మూర్తి అసలు నిజాలు తెలియకుండా .. వాస్తవాలను పట్టించు కోకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు .. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ లను విమర్శించారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సినిమా టిక్కెట్ రేట్ల కంటే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు చాలా ఎక్కువుగా ఉన్నా నారాయణ మూర్తి ఏనాడు నోరు మెదిపిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు పవన్ ఆ సమస్యలు పరిష్కరిస్తానంటే విమర్శిస్తున్నారని నట్టి తెలిపారు. మాజీ సీఎం జగన్ చిన్న సినిమాలకు ఏం చేశారో నారాయణమూర్తి చెప్పాలని, అలానే గుత్తాధిపత్యాన్ని ఎందుకు ఇవాళ ఆయన సమర్థించాల్సి వస్తోందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నట్టి తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు