- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోవాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఈనెల 12న ధియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత ఓజి సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత మైత్రి మూవీస్ నిర్మించే సినిమాలో నటిస్తారు. ఉస్తాది్‌ భగత్ సింగ్ టైటిల్తో తెర‌కెక్కే ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు కాగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు భగత్ సింగ్ సినిమా కూడా మంచి అంచనాలు సెట్ చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో ఓటమి ప్రభుత్వంలో విజయం సాధించి ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.


ఇక పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో జానీ సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తాను చేయాల్సిన సినిమాలు టాలీవుడ్లో ఇతర హీరోలకు వెళ్లినవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే పవన్ చేయకుండా వదిలేసిన సినిమాలలో ఒక్క సినిమా చేసి ఉంటే తాను అసలు రాజకీయాలలోకి వచ్చేవాడినే కాదని చెప్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు తన స్వీయ దర్శకత్వంలో చేయాలని అనుకున్న పొలిటికల్ యాక్షన్ సినిమా సత్యాగ్రహి. ఇప్పుడు హరిహర వీరమల్లు నిర్మాతతోనే ఈ సినిమా ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తాను చేసి హిట్ అయి ఉంటే రాజకీయాల్లోకి రాకుండా అమీర్ ఖాన్ లాగానే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయేవాడినే అని అన్నారని నిర్మాత ఏం రత్నం తాజాగా ఈ విషయాన్ని రివీల్‌ చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: