సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలు క్రితం ఖలేజా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ సినిమాను తాజాగా మే 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి ..? అనే వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 4.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 46 లక్షలు , ఆంధ్ర లో 2.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.16 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు , ఓవర్సీస్ లో 1.14 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా రెండు రోజుల్లో 8.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే మొదట ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ భారీ నష్టాలను ఎదుర్కొంది. కానీ తాజాగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేస్తే మాత్రం ఈ మూవీ రీ రిలీజ్ లో బాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ రీ రిలీజ్ మూవీల కలెక్షన్ల విషయంలో అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: