
మల్టీప్లెక్స్ లలో ఈ రేటు ఉండనుందని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం టికెట్ రేటు 745 రూపాయలుగా ఉండనుందని భోగట్టా. అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం అగాల్సిందేనని చెప్పవచ్చు. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ తో తన దశ తిరిగిపోవడం పక్కా అని నిధి అగర్వాల్ ఫీలవుతున్నారని తెలుస్తోంది.
అతి త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే పాటలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడం హరిహర వీరమల్లు సినిమాకు మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారనే దాని గురించి చర్చ జరుగుతోంది. ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో పెద్ద సినిమాలు విడుదలవుతుండగా ఆ సినిమాల కమర్షియల్ ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు రికార్డుల వీరమల్లు కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో పవన్ మార్క్ డైలాగ్స్ కూడా ఎక్కువగానే ఉండనున్నాయని తెలుస్తోంది. పవన్ హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలాంటి ట్విస్టులతో ఉండబోతుందో చూడాల్సి ఉంది.