- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

యూనివర్సల్ హీరో కమలహాసన్ నటించిన లేటెస్ట్ సినిమా థ‌గ్ లైఫ్‌. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఇంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే కాస్త మిక్స్ డ్‌ టాక్ తెచ్చుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కమలహాసన్ తో పాటు మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రు . 200 కోట్ల భారీ బడ్జెట్లో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభాలు తెచ్చిపెడుతున్నట్టు కోలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.


థగ్ లైఫ్ సినిమా ఓటీటీ రైట్స్ రూపంలో రూ.130 కోట్లు రాగా, శాటిలైట్ రైట్స్ రూ.60 కోట్లు .. మ్యూజిక్ రైట్స్‌కు రూ.20 కోట్లు సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రిలీజ్‌తో వచ్చేది మొత్తం లాభాలే కానున్నాయి. రిలీజ్‌కు ముందే థ‌గ్ లైఫ్ మంచి లాభాలు తెచ్చి పెట్టడంతో మేకర్స్ ఫుల్ గా ఉన్నారు. ఓవ‌రాల్ గా క‌మ‌ల్‌కు కావాల్సినంత డ‌బ్బు ఈ సినిమా తో సొంత‌మైంది. ఈ సినిమాలో శింబు - త్రిష తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ఏ ఆర్ . రెహమాన్ సంగీతం అందించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: