కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలకు అద్భుతమైన రీతిలో కలిసి వస్తూ ఉండేది. ఏదైనా ఒక సినిమాను నిర్మించి ఆ సినిమాను విడుదల చేసినట్లయితే ఆ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వస్తే వెంటనే ఆ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయేవి. అలాగే ఆ మూవీ యొక్క డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయేవి. అలాగే సినిమా ధియేటర్లలో పెద్ద మొత్తంలో కలెక్షన్లను వసూలు చేసేవి. దాని ద్వారా నిర్మాతకు పెద్ద మొత్తంలో డబ్బులు కలిసి వచ్చేవి. ఇలా సిరి పరిశ్రమ ముందుకు సాగుతున్న సమయంలో దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది.

కరోనా ద్వారా సినిమాను ధియేటర్కు వచ్చి చూసే జనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అలాంటి సమయంలోనే ఓ టి టి లలో సినిమాలను చూడడానికి ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. దానితో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లు కూడా ఒక సినిమాను నిర్మాత నిర్మిస్తే అది విడుదల కాకముందే భారీ ధరకు దానిని కొనుగోలు చేయడం జరుగుతూ వచ్చేది. దానితో నిర్మాత మొదటి దశలో చాలా సంబరపడ్డాడు. డిజిటల్ , సాటిలైట్ , డబ్బింగ్ , రీమేక్ ఇలా అనేక రకాలుగా నిర్మాతకు డబ్బులు వచ్చేవి. ఇలా చాలా బాగా కొంత కాలం పాటు నిర్మాతలు డబ్బులు వెనకేసుకున్నారు. ఓ టీ టీ లోకి సినిమా వచ్చాక ప్రపంచం అంతా మూవీ చూసేయడంతో డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య అత్యంత ఘననీయంగా పడిపోయింది.

అలాగే సినిమా విడుదల అయ్యాక నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి మూవీ వచ్చేయడంతో థియేటర్స్ కు వచ్చే జనాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. దానితో సినిమా బాగున్న కూడా మూవీ కి కలెక్షన్లు రాకపోవడం , డబ్బింగ్ , రీమిక్ రైట్స్ కొనేవాళ్లు దొరక్క పోవడం , ఓ టి టి సంస్థలు కూడా సినిమా డిజిటల్ హక్కులు కొనుగోలు చేయడానికి కండిషన్స్ భారీగా పెట్టడంతో తెలుగు సినిమా ఓ టీ టీ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: