మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గురించి అంద‌రికి తెలిసింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ రూమర్ , గాసిప్ గట్టిగా వినిపిస్తుంది .. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని మెగాస్టార్ రెండు పాత్రలో ఒక పాత్ర వింటేజ్ చిరంజీవిని ప్రేక్షకులకు బాగా గుర్తు చేస్తుందని .. ఇక మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటుందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి .. అయితే ప్రస్తుతం చిరంజీవి , నయనతారాలపై ఫ్యామిలీ సన్నివేశాలు తెర‌క్కేకిస్తున్నారు .. చిరంజీవి , నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ ఎంతో హైలెట్ అవుతుందని కూడా అంటున్నారు .

ఇదే క్రమంలో ఈ సినిమా గురించి చిరంజీవి ఈ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తిస్థాయి లో కామెడీ సినిమా అని .  అలాగే ఈ సినిమా కథ‌ తనకు నచ్చిందని చిరు ఇప్పటికే చెప్పేశారు .. ఇదే క్రమంలో అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో సన్నివేశాల గురించి దర్శకుడు అనిల్ నాతో మాట్లాడుతుంటే నాకే కడుపుబ్బ నవ్వొచ్చిందని ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు అభిమన్యులకు ఫుల్ మీల్స్ పెడుతుందని చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు .. అలాగే ఈ సినిమాను సాహు గారపాటి , చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తో కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: