నటసింహం నందమూరి బాలకృష్ణకు 1986ను ఒక గోల్డెన్ ఇయర్ గా చెబుతారు. బాలయ్య కెరీర్ లోనే ఆ ఇయర్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే 1986లో బాలకృష్ణకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఓకే ఏడాది రెండు హ్యాట్రిక్స్ అందుకుని బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు బాల‌య్య‌. ఇంతకీ 1986లో బాలకృష్ణ నటించిన ఏయే చిత్రాలు విడుదలయ్యాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.


ముద్దుల కృష్ణయ్య.. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతోనే ఆ ఏడాది బాలయ్య విజయ పరంపర మొదలైంది. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


సీతారామ కళ్యాణం.. 1986లో విడుదలైన మరో సూపర్ హిట్ మూవీ. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, ర‌జినీ జంటగా నటించారు. పగ ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య నడిచే లవ్ స్టోరీ ఇది. `ముద్దుల‌ కృష్ణయ్య` థియేటర్స్ ఆడుతుండంగానే `సీతారామ కళ్యాణం` కూడా విడుదలైంది. అయితే ప్రేక్షకులు రెండు చిత్రాలకు బ్రాహ్మ రథం పట్టారు.  ఈ సినిమాలో `రాళ్ళల్లో ఇసకల్లో, `కళ్యాణ వైభోగమే` పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


అనసూయమ్మ గారి అల్లుడు.. అదే ఏడాది జులైలో విడుదలైన చిత్రం. కోదండరామిరెడ్డి డైరెక్టర్ కాగా.. బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించారు. శారద ముఖ్యమైన పాత్ర పోషించగా.. నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో 200 రోజులు ఆడింది.


ఆ తర్వాత `దేశోద్ధారకుడు` మూవీ తో బాలకృష్ణ తన సక్సెస్ జోరును కొనసాగించారు. గొల్లపూడి మారుతీ రావు కథ‌ అందించిన ఈ చిత్రానికి ఎస్. ఎస్. రవిచంద్ర డైరెక్టర్. బాలయ్య, విజయశాంతి జంటగా నటించారు. ఆగస్టులో రిలీజ్ అయిన దేశోద్ధారకుడు కూడా సూప‌ర్ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే రూ. 5 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను కొల్లగొట్టింది.


అదే ఏడాది బాలయ్య 30వ సినిమాగా `కలియుగ కృష్ణుడు` మూవీ విడుదల అయింది. కె. మురళీ మోహనరావు తెర‌కెక్కించిన ఈ చిత్రం లో రాధ హీరోయిన్. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన కలియుగ కృష్ణుడు కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది.


ఇక 1986లోనే `అపూర్వ సోదరులు` మూవీతో రెండోసారి హ్యాట్రిక్ కొట్టారు బాల‌య్య‌. ఈ చిత్రంలో ఆయ‌న ద్విపాత్రాభినయం చేశారు. కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ లో రిలీజ్ అయిన అపూర్వ సోదరులు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కుమ్మేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: