
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వం లో పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా కాకుండా చరణ్ నూంచి ఇప్పుడు మరిన్ని సినిమాలను టాప్ దర్శకుల తో ఓకే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు .. ఇక ఇప్పుడు తాజా గా ఈ లిస్టు లోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చి చేరిపోయాడు .. చరణ్ , త్రివిక్రమ్ కాంబో లో ఓ భారీ ప్రాజెక్ట్ రెడీ కాబోతుంది .. పెద్ది సినిమా తర్వాత ఇప్పటికే చరణ్ సుకుమార్ తో తన 17 వ సినిమా ను ఓకే చేసిన విషయం తెలిసిందే ..
సుకుమార్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు .. అయితే ఈ సినిమా కాకుండా చరణ్ తర్వాత త్రివిక్రమ్ తో చేస్తాడని ఇప్పుడు ఫ్రెష్ గా మరో రూమర్ బయటకు వచ్చింది .. అయితే చరణ్ లైనప్ లో ఈ విధంగా జరిగేది లేదట .. ముందుగా సుకుమార్ తో సినిమానే ఉంటుంద ని ఆ తర్వాతే త్రివిక్రమ్ తో సినిమా మొదలు అవుతుంద ని అంటున్నారు .. సో చరణ్ లైన్ అఫ్ పరంగా ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..