పాన్ ఇండియా హీరోయిన్ అయినటువంటి రష్మిక గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఏకంగా మూడు వేల కోట్ల సినిమాల్లో నటించింది.ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇన్ని వేల కోట్ల సినిమాల్లో నటించలేదు.అలా రీసెంట్ గానే నాగార్జున కుబేర మూవీ ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పి రష్మికను గొప్పగా పొగిడారు.. రష్మిక వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించే సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమె చేసే పనులు మాత్రం అస్సలు బాగుండడం లేదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా వివాదంలో ఇరుక్కుంటూ సినిమాలకు ఇబ్బందులు తెస్తుంది. అయితే తాజాగా రష్మిక నటించిన కుబేర మూవీకి కొత్త చిక్కులు తీసుకొచ్చి పెట్టింది.. అంతేకాదు థగ్ లైఫ్ మూవీని ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో అలాగే కుబేర మూవీని కూడా బ్యాన్ చేయాలి అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి..సినిమా బ్యాన్ చేసే వరకు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

రష్మిక ఎప్పుడు తన సొంత రాష్ట్రాన్ని పొగడదు.పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని కించపరుస్తూ తన మాతృభాషను కూడా కించపరుస్తుంది.తన మాతృభాషలో వచ్చిన సినిమాలను కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది అనే టాక్ ఉంది. అంతే కాదు కన్నడలో బ్లాక్ బస్టర్ అయినటువంటి కాంతార మూవీని చూడలేదంటూ అప్పట్లో చిక్కుల్లో పడింది. అలాగే తనకి లైఫ్ ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీని మర్చిపోయి అసలు కన్నడనే గుర్తుంచుకోవడం లేదు. అయితే తాజాగా పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని కించపరిచేలా తన సోషల్ మీడియా ఖాతాలో మరో పోస్ట్ పెట్టింది.అదేంటంటే.. తాజాగా రష్మిక తను సోషల్ మీడియా ఖాతాలో నాకు చెన్నై అంటే చాలా ఇష్టం అని, చెన్నైకి ప్రత్యేక స్థానం ఇస్తానని చెప్పింది.

దీంతో రష్మిక పెట్టిన పోస్టు చూసిన చాలామంది కన్నడిగులు మండి పడుతున్నారు. పుట్టి పెరిగిన కర్ణాటక రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోకుండా అలా చెన్నైకి ప్రియార్టీ ఇస్తావా అంటూ మండిపడుతున్నారు. ఎందుకంటే రష్మిక మందన్నా కర్ణాటకకి చెందిన అమ్మాయి. ఈమె ఇక్కడే పుట్టి పెరిగింది. అలాంటిది కర్ణాటక రాష్ట్రాన్ని తక్కువ చేసి తమిళనాడు రాష్ట్రాన్ని ఎక్కువ చేసి మాట్లాడడం కర్ణాటక ప్రజలకు నచ్చడం లేదు. దీంతో చాలామంది కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో రష్మిక పెట్టిన పోస్ట్ చూసి రష్మిక నటించిన కుబేర మూవీని కన్నడలో బ్యాన్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరి థగ్ లైఫ్ మూవీ లాగే కుబేర మూవీ ని కూడా కన్నడలో బ్యాన్ చేస్తారా అనేది చూడాలి. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్,నాగార్జున,రష్మిక మందన్నా నటించిన కుబేర మూవీ జూన్ 20న విడుదల కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: