ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీని బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ ఖ‌న్నా.. 1997లో `హిమాలయ పుత్ర` సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. అదే ఏడాది విక్టరీ వెంకటేష్ హీరోగా తెర‌కెక్కిన `ప్రేమించుకుందం రా` మూవీతో అంజలా జవేరి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బిగ్ హిట్ అందుకోవడమే గాక ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది. అదే స‌మ‌యంలో టాలీవుడ్ లో భారీ స్టార్డమ్ సంపాదించుకుంది. కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది.


ఆ తర్వాత 2005 వరకు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అంజ‌లా జ‌వేరి నటించింది. అప్పటి టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవిలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2005 నుంచి సినిమాలు చేయ‌డం తగ్గించిన అంజ‌లా జ‌వేరి.. 2012తో సిల్వర్ స్క్రీన్ కి పూర్తిగా దూరమై పర్సనల్ లైఫ్ లో బిజీ అయింది. అంజ‌లా భర్త కూడా న‌టుడే. అత‌నే తరుణ్ అరోరా. 1999లో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఈయన.. విలన్ క్యారెక్టర్స్ కు కేరాఫ్ గా మారారు.


చిరంజీవి రీఎంట్రీ ఫిల్మ్ `ఖైదీ నెం.150`లో విలన్ గా నటించి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరుణ్ అరోరా.. ఆ తర్వాత `కాటమరాయుడు`, `జయ జానకి నాయక`, `అమర్ అక్బర్ ఆంటోనీ`, `అర్జున్ సురవరం`, `సీటీమార్`, `భోళా శంకర్` తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సౌత్ లో స్టార్ విలన్ గా  సత్తా చాటుతున్నారు.


ఇక తరుణ్ అరోరా, అంజలా జవేరి పెళ్లి చేసుకుని 20 ఏళ్లు అయిన ఇంతవరకు ఈ జంట పిల్లల్ని కనలేదు. ఇందుకు కారణం ఏంటని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తరుణ్ అరోరా షాకింగ్ రిప్లై ఇచ్చాడు. సాధారణంగా చాలామంది జంటలు తమ మధ్య లవ్ పెర‌గ‌డానికి, బాండింగ్ మ‌రింత స్ట్రాంగ్ అవ్వ‌డానికి పిల్లల్ని కంటూ ఉంటారు. కానీ మాది ప్రేమ వివాహం. మా మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అందుకే పిల్లల్ని కనాలనుకోలేదు. ఇకపై క‌నకూడదని కూడా నిర్ణయించుకున్నాం` అంటూ తరుణ్ అరోరా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: