మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్ .. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది .. టాలీవుడ్ బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మెక‌ర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి .. దేవర లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావటం తో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. కాగా ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రశాంత్ నీల్ రేడీ చేసిన కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పారట ఎన్టీఆర్ .. అయితే అందుకోసం మరొక రెండు వ‌ర్షన్ లు రెడీ చేసి ఎన్టీఆర్ కు వినిపించగా అవి ఓకే కాలేదు .. ఇక దాంతో నాగేంద్ర కాసి అనే ఓ యంగ్ రైటర్ ను ఈ సినిమా కోసం పిలిపించి మార్పులు చేర్పుల బాధితులు నాగేంద్రకు అప్పచెప్పారు ..
 

అయితే ఈ ఫైనల్ వెర్షన్లో నాగేంద్ర చేసిన మార్పులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇంప్రెస్ అయ్యాడట .. అల్లు అర్జున్ పుష్ప2 ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాలకు కూడా రైటింగ్లో వర్క్ చేశాడు నాగేంద్ర కాసి .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా తన వంతు పాత్ర పోషించాడు .. కథ కథనాలు అన్ని ఒకే అవటంతో జడ్జ్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు ప్రశాంత్ .. అలాగే మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమాకు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతమందిస్తున్నాడు .. అలాగే ఈ సినిమాను 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: