
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒడిస్సా నేపథ్యంలో ఉండే ఒక నృత్యం ఈ చిత్రంలో ఒక కీలకంగా ఉంటుందని.. ఇందుకు సంబంధించి అక్కడ మయూర్ భంజ్ అనే నృత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా రాజమౌళి ప్రియాంక చోప్రా కి తెలియజేశారట. అయితే ఈ నృత్యంలో ఆరితేరిన ఒడిస్సా కళాకారుడు విక్కీ భర్తయా ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా నేర్చుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మూడు విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉండబోతుంది.ఈ సినిమాకి ఇదే కీలకంగా మారబోతుందట.
అయితే ఈ విషయాన్ని ప్రియాంకకు నృత్యం నేర్పిస్తున్న భర్తయా ఈ విషయాన్ని తెలియజేశారు .ప్రియాంక చోప్రా కు ఇలాంటి నృత్యం నేర్పించడం తనకు చాలా గొప్పగా ఆనందంగా ఉందని తెలిపారు. నృత్యాన్ని అభ్యసించడంలో కూడా ఆమె చూపించిన తీరు నిజంగా స్ఫూర్తిదాయనికంగా ఉందని తెలిపారు. ఒక పెద్ద హీరోయిన్ అన్న భావన ఆమెలో ఎక్కడ కనిపించలేదని ఇలాంటి సినిమాలో భాగం కావడం తనకి ఆనందంగా అనిపించింది అంటూ తెలియజేశారు భర్తయా. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రెజర్ హంట్ మూవీగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గ్లోబల్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా రాజమౌళి ఆర్డర్ వేస్తే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే రాజమౌళి మీద నమ్మకంతోనే అందరి నటీనటులు ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటారని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.