
ఈరోజు సిద్దార్థ్ 3 BHK మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్క మధ్య తరగతి వ్యక్తి రియల్ లైఫ్ ను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంది. ఇంటిని కొనుగోలు చేయడం కోసం తండ్రి పడే తపనను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు
సమాజంలో మధ్య తరగతి వాళ్లకు ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఎదురయ్యే మోసాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ప్రతి సీన్ ప్రత్యేకం అని చెప్పవచ్చు. సిద్దార్థ్ సైతం ఈ సినిమాకు తన నటనతో ప్రాణం పోశారని చెప్పాలి.
విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న సిద్దార్థ్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నా కలెక్షన్లు అయితే రావడం లేదు. 3 BHK సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది. సిద్దార్థ్ భవిష్యత్తు సినిమాలతో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాలకు సంబంధించి సిద్దార్థ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. సిద్దార్థ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత పరిమితంగానే ఉంది. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సిద్దార్థ్ ప్రస్తుతం భిన్నమైన కథాంశాలకు ఓటు వేస్తుండటం గమనార్హం.