
బాహుబలి పాత్ర కోసం ఆయన 105 కిలోల బరువు పెంచగా, శివుడు పాత్ర కోసం 85కి తగ్గించారు. రానా దగ్గుబాటి భల్లాలదేవుడిగా తన క్యారెక్టర్‌కి తగినట్లే 33 కిలోల బరువు పెరిగాడు. ఇంత భారీగా ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. షూటింగ్ స్పాట్స్ - చిత్రీకరణలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అంతేకాక, మంచు కొండల సన్నివేశాలను బల్గేరియాలో ప్రత్యేకంగా చిత్రీకరించారు. సినిమాకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కిలికి’ భాష ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
బిజినెస్ & రికార్డులు :
‘బాహుబలి: ది బిగినింగ్’ ఒక్కటే రూ. 600 కోట్ల వసూళ్లు సాధించింది.
రెండు భాగాల కలిపి 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
186 కోట్ల లాభం, అంటే ఒక తెలుగు సినిమాకు అప్పుడు లభించిన అత్యధిక ప్రాఫిట్.
అనేక అవార్డులు, జాతీయ స్థాయిలో గుర్తింపు, గ్లోబల్ ఫ్యాన్ బేస్.
ఇండియన్ సినిమా కొత్త యుగానికి నాంది .. "బాహుబలి" ఒక సినిమా మాత్రమే కాదు - ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన సంచలన చిత్రం. అది తర్వాత పాన్ ఇండియా సినిమాల కోసం దారి చూపింది. కేజీఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్, పుష్పా వంటి హిట్ చిత్రాలకు బాహుబలే పునాది వేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో #10YearsOfBaahubali, #BaahubaliBegins, #PrabhasLegacy వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు వీడియో ట్రిబ్యూట్లు, ఫ్యాన్ ఆర్ట్‌లు పోస్ట్ చేస్తూ పాత జ్ఞాపకాలలో మునిగిపోతున్నారు. బాహుబలి తెలుగు సినిమా మైలురాయి మాత్రమే కాదు, భారతీయ సినీ చరిత్రలో శాశ్వతమైన పేజీ .. ఇప్పుడు పదేళ్లు అయినా… బాహుబలి పేరు వినగానే గూస్‌బంప్స్ రావడమే దానికి నిదర్శనం.