ఇటీవల విడుదలైన `కన్నప్ప` మూవీతో టాలీవుడ్ లో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయింది ప్రీతి ముకుందన్. అయితే ఈ కుర్ర హీరోయిన్ కు ఇదే తొలి చిత్రం అనుకుంటే పొరపాటే. నిజానికి ప్రీతి ముకుంద‌న్‌ 2024లో విడుద‌లైన `ఓం భీమ్ బుష్‌` మూవీతో తన సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత `స్టార్` అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచు విష్ణు టైటిల్ పాత్రలో తెర‌కెక్కిన `కన్నప్ప`లో నెమలి పాత్రలో నటించి ఆక‌ట్టుకుంది. రెండో సినిమాకే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.


క‌న్న‌ప్ప‌లో ప్ర‌భాస్‌, ప్రీతి ముకుంద‌న్ మధ్య వచ్చే స‌న్నివేశాలకు ప్రేక్షకుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ప్రీతి ముకుందన్ ఓపెన్ కామెంట్స్‌ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పెద్ద సినిమాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కన్నప్ప అలాంటి ప్రాజెక్టే.


ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించిన అనుభవం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. స్క్రీన్ పై ఆయ‌న ప్ర‌త్యేక‌త స్పష్టంగా కనిపించింది. నిజజీవితంలోనూ ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ.. ఆ గర్వం కాస్తైనా క‌నిపించదు. చాలా సింపుల్ గా ఉంటారు. ఎవర్నీ చిన్న చూపు చూడరు. సెట్లో అందరిని గౌరవిస్తారు` అంటూ ప్రీతి ముకుంద‌న్ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారాయి. కాగా, ప్రీతి ముకుంద‌న్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ఈ అమ్మ‌డి చేతిలో తెలుగు చిత్రాలు లేన‌ప్ప‌టికీ రెండు త‌మిళ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. మ‌రోవైపు `మైనే ప్యార్ కియా` అనే మూవీతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: