పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు.. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన హరిహర వీరమల్లు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కరోనా సమయంలో స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలకు షూటింగ్ పూర్తిచేసుకుని తాజాగా విడుదలైంది.. ఇప్పటికే సినిమా ప్రీమియర్ షోస్ చూసిన నెటిజన్లు ఎక్స్ ద్వారా స్పందిస్తూ అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు.అందరూ పాజిటివ్ రివ్యులు ఇస్తున్నారు. ఎవరో ఒకరిద్దరూ నెగటివ్ రివ్యూ లు ఇస్తున్నారు తప్ప మిగతా వారందరూ సినిమా ఒక్కసారి చూడవచ్చు అంటూ తమదైన స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు. 

అయితే ఈ సినిమా అంతా బాగానే ఉంది కానీ జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయలేకపోయారనే వాదన సినిమా చూసిన ప్రేక్షకుల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయని,కానీ జ్యోతి కృష్ణ సీన్స్ అంత బాలేవని పెదవి విరుస్తున్నారు. అలాగే స్క్రీన్ ప్లే పేలవంగా ఉందంటున్నారు. ఇక ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ పవన్ కళ్యాణ్ ఎనర్జీ అంతా బాగుందని ముఖ్యంగా ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 కూడా ఉంటుంది అని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అలాగే హరిహర వీరమల్లు సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళందరికీ పార్ట్ 2 పై ఒక క్లారిటీ అయితే వస్తుంది.

ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాలో కోహినూరు వజ్రం కోసం హరిహర వీరమల్లు ఢిల్లీకి బయలుదేరుతాడు. అలా ఢిల్లీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ని అడ్డుకునేందుకు ఔరంగజేబు పాత్రలో నటించిన బాబీ  డియోల్ తన సైన్యంతో సిద్ధమవుతాడు.అయితే వీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడడంతోనే ఫస్ట్ పార్ట్ ని ముగించేశారు. దీంతో రెండో పార్ట్ పై అభిమానుల్లో మరన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే హర హర వీరమల్లు పార్ట్ 1 ముగించే సమయంలోనే యుద్ధభూమి అనే నేమ్ కార్డుతో స్క్రీన్ పై చూపించి అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ హరిహర వీరమల్లు పార్ట్ -2 పై అంచనాలు పెంచేసారు మూవీ మేకర్స్. అయితే హరిహర వీరమల్లు 2 హిందూ ధర్మ పరిరక్షణ కోసం కోహినూరు వజ్రం దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీర పోరాటం చేస్తారు..

ఇక ఔరంగజేబుతో పోరాటం చేసే సినిమా మొత్తం హరిహర వీరమల్లు పార్ట్ 2 లోనే ఉంటుందని అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమా కి సీక్వెల్ గా రాబోతున్న పార్ట్ 2 కి పేరు ఇదే అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. అదేంటంటే "యుద్దభూమి"..ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 ముగించే సమయంలోనే యుద్ధభూమి అనే నేమ్ కార్డు ఇవ్వడంతో పాటు అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ అంచనాలు పెంచడంతో హరిహర వీరమల్లు పార్ట్ 2 టైటిల్ యుద్ధ భూమి అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. అలా యుద్ధభూమి అనే టైటిల్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ హరిహర వీరమల్లు పార్ట్ 1 కి సీక్వెల్ గా రాబోతున్న యుద్ధభూమి టైటిల్ అద్భుతంగా ఉంది అని పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: