సినిమా ఇండస్ట్రీ లో హిట్టు కాంబినేషన్కు మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే ఒక హీరో , ఒక దర్శకుడితో పని చేసే ఆ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే మరోసారి ఆ దర్శకులతో పని చేయాలి అని ఆ హీరో అనుకోవడం , అలాగే ఆ హీరో తో మరో సినిమా చేయాలి అని ఆ దర్శకుడు అనుకోవడం సహజం. కానీ ఓ హీరో , దర్శకుడు కాంబినేషన్లో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లయితే వారి కాంబినేషన్లో సినిమా వచ్చిన కానీ ఆ సినిమా రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయిన వెంటనే మరోసారి ఆ కాంబినేషన్లో మూవీ దాదాపుగా ఉండదు. కానీ తాజాగా శివ కార్తికేయన్ మాత్రం అదే రూట్లో వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ నటుడు శివ కార్తికేయన్ తాజాగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో మదరాసి అనే సినిమాలో హీరోగా నటించాడు. రుక్మిణి వసంత్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది.

సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోతుంది. శివ కార్తికేయన్ , ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన మొట్ట మొదటి సినిమా అయినటువంటి మదరాసి సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో శివ కార్తికేయన్ మరోసారి మురుగదాస్  దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. శివ కార్తికేయన్ తన తదుపరి మూవీ ని మురగదాస్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్లు , ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు కూడా శర వేగంగా జరుగుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజం గానే శివ కార్తికేయన్ , మురగదాస్ కాంబోలో మరో మూవీ త్వరలోనే వస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk