దేశం నలుమూలలా ఒకే పేరు – మోడీ. చిన్నపాటి టీ అమ్మే బాలుడి నుంచి దేశాన్ని నడిపే ప్రధానమంత్రిగా ఎదగడం అనేది నిజంగానే ఒక ప్రేరణాత్మక గాథ. 2025 సెప్టెంబర్ 17 అన‌గా నెటీతో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 75వ ఏట అడుగుపెడుతున్నారు. ఇది ఆయన జీవితంలో వజ్రోత్సవ ఘట్టం. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆర్ఎస్ఎస్ ప్రభావం ఆయనపై పడింది. వాదు‌నగర్ లో ఒక చిన్న కార్యకర్తగా మొదలైన ప్రయాణం క్రమంగా విస్తరించింది. 1985లో బీజేపీలో చేరిన ఆయనను అద్వానీ ప్రత్యేకంగా గమనించారు. 1990లో జరిగిన రథయాత్ర వెనక అసలు బలమైన నిర్వాహకుడు మోడీ అని అప్పటినుంచే చెప్పేవారు. ఆ క్రమంలోనే గుజరాత్ బీజేపీని ఆయన తన భుజాలపై మోశారు. 1995లో గెలుపు, 1997లో అంతర్గత సంక్షోభం… ఈ రెండింటిని ఎదుర్కొని 1998లో మళ్ళీ పార్టీని గెలిపించారు.


అయితే నిజమైన మలుపు 2001లో వచ్చింది. చిమన్ భాయ్ పటేల్ అనారోగ్యం కారణంగా సీఎం పదవి ఖాళీగా ఉండగా అద్వానీ, వాజ్‌పేయి తొలుత సందేహించినా చివరికి మోడీని ముందుకు తెచ్చారు. అసలు చట్టసభకు ఎప్పుడూ వెళ్లని వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. 2002లో తొలి ఎన్నికల్లోనే గెలుపు సాధించి తన సత్తా చాటారు. అక్కడినుంచి 2014 వరకు వరుసగా గుజరాత్ సీఎం గా 13 ఏళ్లు పాలిస్తూ బీజేపీకి శక్తి, స్థిరత్వం తెచ్చారు. జాతీయ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ కూడా మామూలు కాదు. 2013 సెప్టెంబర్‌లో బీజేపీ ప్రధానమంత్రిపదవి అభ్యర్థిగా ప్రకటించగానే దేశవ్యాప్తంగా మోడీ హవా మొదలైంది. 2014లో బీజేపీకి పూర్తి మెజారిటీ తేవడం ఆయన మేనేజ్‌మెంట్, ప్రజల్లో ఉన్న పాపులారిటీకి నిదర్శనం. అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలతో మూడు సార్లు ప్రధానమంత్రిగా గెలిచి, కాంగ్రెసేతర నేతల్లో అత్యంత కాలం పాలించిన రికార్డు సాధించారు.



మోడీ ప్రయాణం ఒక సవాలు, ఒక పోరాటం. ఆయనను తక్కువ అంచనా వేసినవారినే ఫలితాలతో సమాధానం చెప్పారు. గుజరాత్ లో ఎదురైన విమర్శలు, జాతీయ రాజకీయాల్లో ఎదురైన అడ్డంకులు – అన్నింటినీ దాటుకుంటూ దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఓ మూవ్‌మెంట్. 75 ఏళ్ళ వయసులోకి అడుగుపెడుతున్న ఈ ఘట్టం ఆయనకే కాదు, ఆయనపై నమ్మకం ఉంచిన కోట్లాది భారతీయులకూ ఒక గర్వకారణం. టీ స్టాల్‌ నుంచి టాప్ పోస్ట్ వరకు – ఇదే మోడీ గాథ!

మరింత సమాచారం తెలుసుకోండి: