టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే తన నటనతో, అందంతో, అభినయంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషలలో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ మహానటిగా తిరుగులేని స్టార్ డం సంపాదించుకుంది. ఇప్పుడు ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలో నటిస్తోంది కీర్తి సురేష్. అలా బాలీవుడ్ లో కూడా సరికొత్త అధ్యాయంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ గత ఏడాది బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిసినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.


తాజాగా ఒక మ్యాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను, లక్ష్యాలను సైతం గుర్తుచేసుకుంది.తన కెరియర్లో మరో ఉత్తేజకరమైన  అధ్యాయం మొదలయ్యిందని.. తనను సవాల్ చేసే పాత్రలు, కొత్త కథల కోసమే బాలీవుడ్లోకి వచ్చానని.. ఇక్కడ వర్క్ కల్చర్ తనకీ అన్ని విధాలుగా చాలా భిన్నంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ కొత్త విషయాలను ఆస్వాదిస్తున్నానని కీర్తి సురేష్ తెలిపింది..


అలాగే తన తండ్రి ముందుగా తన చదువు పూర్తి చేయాలని తనమీద చాలా ఒత్తిడి చేసే వారిని.. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు వంటివి ఎంచుకున్నానని కానీ నటన పైన ఉండే ఫ్యాషన్ తనను చివరికి సినిమాల వైపుగా అడుగులు వేసేలా చేసిందని తెలిపింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైపు వైవాహిక బంధంతో బిజీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్లలో పాల్గొంటోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, కన్నెవేడి వంటి చిత్రాలతో పాటుగా మరో రెండు మూడు చిత్రాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. తనకు ఉండే క్రేజ్ తో హిందీ సినిమాలలో కూడా నటిస్తూ కొత్త తరహా పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే  తన లక్ష్యం అంటున్న కీర్తి సురేష్ మరి తనకి ఎదురయ్యే  సవాళ్లను ఏ విధంగా దాటుకొని బాలీవుడ్ ప్రయాణం ఎంత విజయవంతంగా చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: