ఎప్పటిలాగే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వచ్చే సంక్రాంతి పండుగ కోసం స్టార్ హీరోలు ఇప్పటికే తమ సినిమాలను సెట్ చేసుకుంటున్నారు. ఈ సీజన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్, ఫ్లాప్ మధ్య తేడా ఉన్నా, లాభాల పాయింట్ కోసం ప్రతి నిర్మాత కూడా ఈ స్లాట్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. సంక్రాంతి సెలవులు ప్రేక్షకుల ఫ్యామిలీ క్రౌడ్‌ను ఆకర్షించే అవకాశం ఇస్తాయి, కాబట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎలాంటి పోటీనైనా నిలబడవచ్చు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినిమా – 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, సాహు గారపాటి, చిరు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12, 2026న రిలీజ్ అవుతుంది.
 

నయనతార హీరోయిన్‌గా నటిస్తూ, వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. తరువాత రవితేజ 76వ చిత్రంగా వస్తున్న #RT76. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా, దసరా సందర్భంగా టైటిల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి స్లాట్ కోసం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తరువాత బాలకృష్ణ అఖండ 2: తాండవం. 'అఖండ' సినిమా విజయంతో పాపులర్ అయిన బాలకృష్ణ, ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న 'అఖండ 2: తాండవం'ను వచ్చే సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మొదట OG సినిమాకు పోటీగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నా, వాయిదా వేయడం జరిగింది.



రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ది రాజా సాబ్', తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ హారర్ జానర్‌లో తొలి ప్రయత్నం. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సి ఉండగా, జనవరి 9, 2026కి వాయిదా వేసారు.ఇంకా  'అనగనగా ఒక రాజు'. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరి 14, 2026న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. మరియు కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా తన తాజా మూవీ 'జననాయకుడు' తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా స్టార్‌ హీరోలు, ఐదు ప్రధాన సినిమాలు .. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంటుంది. విజయం ఎవరి వ‌స్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: