రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశ పటాని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే అత్యంత కీలక పాత్రలో నటించారు. కొంత కాలం క్రితం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను కొల్ల గొట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా కల్కి 2 కూడా రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ "కల్కి 2" సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే కల్కి 2898 AD సినిమాలో దీపికా పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ఇక ఆ సినిమాతో ఆమె పాత్ర ముగిసిపోలేదు. ఆమె పాత్రను రెండవ భాగంలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఆమెది కల్కి 2898 AD సినిమాలో అత్యంత కీలక పాత్ర. ఇకపోతే ఇలాంటి సమయం లో దీపిక కల్కి 2 మూవీ నుండి తప్పుకుంది అని వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరో గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కోసం మొదట దీపికా పదుకొనేను తీసుకోవాలి అనుకున్నారు.

కానీ ఆమె ఆ మూవీ నుండి తప్పుకుంది. అలాగే ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ ని కూడా ఆమె పి ఆర్ టీం విడుదల చేసే విధంగా హింట్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కల్కి 2 మూవీ నుండి కూడా ఈమె తప్పుకుంది. దానితో ఈమెకు కల్కి పార్ట్ 2 సినిమాకి సంబందించిన స్టోరీ మొత్తం తెలుసు. ఈమె ఆ కథను కూడా లీక్ చేస్తుందేమో అని కొంత మంది ప్రభాస్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: