ఏదైనా బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే, కచ్చితంగా సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రెటీస్ చేసే హంగామా కొంచెం ఓవర్ గానే ఉంటుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విషయంలో కూడా ముమ్మాటికి అలాగే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా, ఇది నిజమే అని చాలా మంది చెబుతున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని ఇప్పుడు తేజ సజ్జ అభిమానులు బలంగా రైజ్ చేస్తున్నారు.


తెలుసు కదా, తేజ సజ్జ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న ప్రతిభావంతుడు. రీసెంట్‌గా ఆయన నటించిన "మిరాయి" సినిమాతో తానేంటో, తనలో ఉన్న టాలెంట్ ఏంటో స్పష్టంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమాలో కథ ఉంది, కంటెంట్ ఉంది, ప్రదర్శనలో కష్టపడి చేసిన పని తీరు ఉంది. మొత్తానికి ఆ సినిమా మంచి కంటెంట్ డ్రివన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ సెలబ్రిటీ లు ఆ సినిమాను హైలైట్ చేస్తూ తేజ సజ్జను పొగడలేదు.



ఇక ఓజీ తో పోల్చి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విషయంలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలి కదిలి వచ్చి ఆయనకు అండగా నిలిచింది. రకరకాలుగా ప్రమోట్ చేశారు, సోషల్ మీడియాలో  పోస్టులు, టాటూలు వేసుకున్నారు, రిలీజ్ తర్వాత సినిమా గురించి ఆకాశానికి ఎత్తి పొగడ్తలు కురిపించారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి వాస్తవానికి అలాంటి సపోర్ట్ అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఒక్కరే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ చేసేస్తారు. అయినా కూడా సెలబ్రిటీస్ మాత్రం "మేమున్నాం, మేమున్నాం" అన్నట్లుగా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం గమనార్హం.



దీంతో సోషల్ మీడియాలో తేజ సజ్జ అభిమానులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  "పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో చూపించిన ధైర్యం, అదే ఉత్సాహం, అదే సపోర్ట్ మిరాయి సినిమా విషయంలో ఎందుకు చూపించలేకపోయారు? ఇండస్ట్రీ పెద్దలు మారరా? ఇంతకాలం చెప్పే నెపోటిజం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందా?" అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.



తేజ సజ్జ అభిమానులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాబట్టి, ఆయనకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. కానీ తేజ సజ్జ లాంటి బ్యాక్ గ్రౌండ్ లేని యువ హీరో విషయంలో మాత్రం పట్టించుకోలేదు. ఇది కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించకపోవడమే కాకుండా, నెపోటిజాన్ని మరోసారి బలపరచడం అవుతుందని వారు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. మొత్తానికి, ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్ కోసం ఇండస్ట్రీ ఒక్కసారిగా కదిలి రావడం చూస్తుంటే ఆశ్చర్యమే. కానీ మరోవైపు, తేజ సజ్జలాంటి కొత్త హీరో కష్టపడి చేసిన సినిమాకు మాత్రం కనీసం గుర్తింపు ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమని, ఇది మారాల్సిన సమయం వచ్చిందని తేజ సజ్జ అభిమానులు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: